దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయి: కేంద్ర ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: రూ 10 నాణేలు చెల్లుబాటులో వున్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కరిలో అనుమానం ఉంది. ఇదే అంశంపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.రూ.10 కాయిన్ చెలామణిలో లేదని చాలా మంది చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘రూ.10 కాయిన్స్ నకిలీవన్న ఉద్దేశంతో దేశంలో చెల్లుబాటు కావడంలేదా? వాటి చెల్లుబాటు కోసం కేంద్రం ఏమైనా చర్యలు తీసుకుంటోందా?’ అని తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే సభ్యుడు ఎ.విజయకుమార్ ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయన్నారు.

ఆర్బీఐ రూ.10 కాయిన్స్ వివిధ సైజులు డిజైన్లలో ముద్రిస్తోంది. అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయి. రూ.10 కాయిన్స్ అన్ని లావాదేవీలకు వాటిని వినియోగించవచ్చన్నారు.రూ.10 నాణేలను తీసుకోవడంలేదని పౌరుల నుంచి కంప్లైంట్స్ అందుతున్నాయని దీని గురించి ఆర్బీఐ చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. ప్రజల్లో ఉన్న అపోహలు అనుమానాలను తొలగించడానికి ఎప్పటికప్పుడు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. నిస్సందేహంగా అన్ని లావాదేవీల్లో పది రూపాయల కాయిన్స్ తీసుకోవాలని ప్రజలను కేంద్రమంత్రి పంకజ్ చౌదరి కోరారు.

Leave A Reply

Your email address will not be published.