హిజాబ్ వివాదంపై టిఆర్ఎస్ కార్పొరేటర్ సూదగోని మాధవి స్పందన

  • స్త్రీలు సృష్టికర్తలు..
  • వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని వ్యాఖ్య

కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో రగులుతున్న హిజాబ్ వివాదం పై 18వ డివిజన్ రేకుర్తి కార్పొరేటర్ సూదగోని మాధవి స్పందించారు. ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న వార్తలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మహిళల వస్త్రధారణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టి కర్తలని, వారికి స్వంత నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని స్పష్టంచేశారు.

నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు …హిజాబ్ ధరించడం ముస్లిం మహిళల వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలన్నారు. హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్.. మతమేదైనా సరే మనమంతా భారతీయులమని..భిన్నత్వంలో ఏకత్వం ఈదేశ సార్వభౌమత్వం అని ఎలుగెత్తి చాటాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.