రాజకీయపార్టీ వైపు ఆర్ కృష్ణయ్య అడుగులు..రంగసిద్దం

  • బీసీల చైతన్య కార్యక్రమాల పేరుతో అనుబంధ సంఘాలతో కార్యాచరణ
  • ఈ నెల 15 న రాజకీయ శిక్షణ తరగతుల పేరుతో ప్రణాళిక

హైదరాబాద్ ఫిబ్రవరి 15: బీసీల చైతన్య కార్యక్రమాల పేరుతో సంక్షేమ సంఘం అనుబంధ సంస్థ తో కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. 15 న రాజకీయ శిక్షణ తరగతుల పేరుతో అనుబంధ సంస్థల ప్రక్షాళన నకు శ్రీకారం చుట్టబోతున్నారు. 2024 రాజ్యాధికారం లక్ష్యం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీల తో విస్తృతస్థాయి సమావేశాలు నిర్విహించాబోతున్నారు.పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని నిర్నయించికున్నట్లు సమాచారం.ఈ సంఘములో ఎన్ని పదవులు ఉనాయో, ఏవరు ఏవరు ఏమిటో ఎవరికి తెలియని పరిస్థితి. ఈ నేపద్యం లో నూతన కార్యవర్గం వర్గాల ఎంపికకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. పాత కమిటీలు రద్దు కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. త్వరలో కార్యాచరణ ప్రణాళిక ను రూపొందిస్తున్న నేపద్యం లో రాజకీయ పార్టీల్లో ప్రకంపనలు ప్రారంబమైనాయి. ఒకవైపు బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో నువ్వా నేనా అని ఢీకొని, స్థాయిని మించి విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్న తరుణంలో త్వరలో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది.ఇప్పటి వరకు నిస్తేజం లో నున్న బిసి లు ఈ సమయం మించితే మనకు రాజ కేయ మనుగడ లేదు అన్న ఆలోచనకు వచ్చినట్లు సమాచారం.ఈ నేపద్యం లో రాజకేయ పార్టీ పెట్టాలని గట్టి నిర్ణయానికి వచ్చారు.అందుకు ఆర్.కృష్ణయ్య ను తమ నాయకున్ని ఎంచుకో నున్నారు. దీనిని దృష్టి లో పెట్టు కొని కృష్ణయ్య ఒకఅడుగు ముందుకు వేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమం లొనే రాజకీయ శిక్షణ తరగతులు పేరు తో నూతన క్యాడర్ ను తీసుపైకి తెబోతున్నారు. ప్రస్తుతం సంఘానికి అనుబందంగా ఉన్న దాదాపు 83 సంఘాలను ప్రక్షాళన చేయ బోతున్నట్లు సమాచారం. దీనితో ఆయా సంఘాల నేతలమంటూ చలామణి అయ్యే నాయకులకు ఉద్వాసన తప్పదని తెలుస్తుంది.పని చేసే వారికే పగ్గాలు అని నినాదంఎంచుకోవడం తో ఇక పైరవి కారుల ఆటలు సాగవన్నది స్పష్టమవుతుంది.ప్రస్తుత ఈ అవకాహన్ని జార విడుచుకుంటే రానున్న 100 సంవత్స రాలకు గాని బిసి లు రాజ్యాధికారం లోకి రారనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.