Browsing Category

జాతీయo

హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీ ఏర్పాటు

తిరుమల ఫిబ్రవరి 16: హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణ కోసం కమిటీని ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి వెల్లడించారు. చారిత్రక, పురాణ, పౌరాణిక, ఇతిహాసాలు, శాసనాలతో కూడిన ఆధారాలతో అందనాద్రియే హనుమంతుడి జన్మస్థలంగా కమిటీ నిర్ధారించింది. కమిటీ…

బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు దిశగా అడుగులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: జాతీయ రాజకీయాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ కుదుపు కుదిపారు. స్తబ్ధుగా ఉన్న బీజేపీయేతర ముఖ్యమంత్రులను జాగృతపరిచారు. నరేంద్ర మోడీని గద్దె దింపడమే లక్ష్యంగా ఒక్కటవ్వాలనే ఆకాంక్షను వారిలో రగిలించారు కేసీఆర్‌.…

అసోం సీఎం వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ ఆగ్రహం

హైదరాబాద్: రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన నిర్వహించారు. గాడిదలపై హిమాంత బిశ్వ శర్మ,అమిత్ షా,మోడీ చిత్ర పటాలను ఊరేగించారు. మహిళా…

నోట్ల ర‌ద్దు, జీఎస్టీ అమ‌లు వంటి నిర్ణ‌యాలతో ఎవ‌రు బాగుప‌డ్డారు

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని నిలదీసిన రాహుల్ గాంధీ చండీఘ‌ఢ్ ఫిబ్రవరి 15: పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోమ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌ధాని తీసుకున్న నోట్ల ర‌ద్దు, జీఎస్టీ…

వాలీబాల్ పోటీలను ప్రారంభించిన మంత్రి తలసాని

హైదరాబాద్: తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలకు చెందిన 10 మెన్, 10 ఉమెన్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ…

ప్రపంచవ్యాప్తంగా గంటపాటు ఆగిపోయిన ట్విట్టర్ పిట్ట కూత.. క్షమాపణలు కోరిన ట్విట్టర్

ప్రపంచ వ్యాప్తంగా గంటపాటు ట్విట్టర్ పిట్ట కూత ఆగిపోయింది. దీంతో యూజర్లు నానా అవస్థలు పడ్డారు. గత రాత్రి 11 గంటల నుంచి గంటపాటు ట్వీట్ చేయడంలో యూజర్లు ఇబ్బంది పడ్డారు. భారత్‌లోనూ ట్విట్టర్ సేవలు ఆగిపోయాయి. మొబైల్ మాత్రమే కాదు వెబ్‌సైట్‌లోనూ ఈ…

అమెరికా ద్రవ్యోల్బణం ప్రభావం… భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ఠానికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. మన మార్కెట్లు కూడా ఈరోజు కుప్పకూలాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి…

7 రోజుల క్వారంటైన్‌

ముంబై   ఫిబ్రవరి 11: కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతం దేశంలో తగ్గుముఖం పడుతోంది. ఇప్పుడు థర్డ్‌వేవ్‌ కూడా ముగియబోతోంది. ఇక కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలను సడలించింది.…

హిజాబ్ వివాదంపై టిఆర్ఎస్ కార్పొరేటర్ సూదగోని మాధవి స్పందన

స్త్రీలు సృష్టికర్తలు.. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని వ్యాఖ్య కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో రగులుతున్న హిజాబ్ వివాదం పై 18వ డివిజన్ రేకుర్తి కార్పొరేటర్ సూదగోని మాధవి స్పందించారు. ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండింగ్…

పీఎస్ఎల్వీ సీ-52 రాకెట్ ప్రయోగం డేట్ ఫిక్స్

సూళ్లూరుపేట: వాలంటైన్స్ డే రోజు ఇస్రో సైంటిస్టులు కీలక ప్రయోగానికి రంగం సిద్ధం చేశారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈ ఎస్ ఓ-04 లాంచింగ్‌ను ఫిబ్రవరి 14న జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈనెల 14న ఉదయం 5:59 గంటలకు పీఎస్‌ఎల్వీ సీ-52 రాకెట్…