ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు

జమ్మికుంట: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఅర్ 68 వ జన్మదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణ శాఖ అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా తెరాస కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు హాజరై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్తున్నారని కొనియాడారు.. ముఖ్యమంత్రి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.