చింపాంజితో ప్రేమాయణం… షాక్ లో జూ సిబ్బంది

యాంట్ వెర్ప్: మనుషులు హద్దులు మీరుతున్నారు. మానవ విలువలు మంటగలిసేలా ప్రవర్తిస్తున్నారు. ఎవరేమని అనుకున్నా పర్వాలేదు… తమకు నచ్చిన పని చేసుకుంటూ పోతున్నారు.

ఒక మహిళ మరింతగా దిగజారి చింపాజితో ప్రేమాయణం చేసింది. ప్రతినిత్యం చింపాంజిని ఎందుకు కలుస్తున్నావని అడగ్గా… ప్రేమిస్తున్నానని చెప్పడంతో జూ అధికారులు కంగుతిన్నారు. ఇక చేసేది లేక ఆమె ను జూ లోకి రాకుండా నిషేధం విధించారు. ఈ ఘటన బెల్జియం పోర్టు సిటీ యాంట్ వెర్ప్ జూ లో చోటు చేసుకున్నది. ఈ విషయం తెలియడంతో జంతు ప్రేమికులు షాకు కు గురై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రతిరోజు జూ కు వస్తున్న ఒక యువ మహిళ ఎడి టిమ్మెర్ మాన్స్ (38) చింపాంజితో ఎక్కువ సమయం గడుపుతున్నది. వీడియో ఫుటేజి ఆధారంగా గమనించిన జూ అధికారులు ఎందుకుంత సమయం గడుపుతున్నారని అడిగారు. తనతో ఉంటే సమయం గడిచిపోతున్నదని, గాఢంగా ప్రేమించినట్లు చెప్పడంతో అధికారుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. జంతువును లవ్ చేయడం ఏంటని చర్చించుకున్నారు. వచ్చిన ప్రతిసారి సైగలు చేసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం జరుగుతున్నది చూశారు. ప్రేమ మరింతగా ముదరకుండా ఉండేందుకు ఆమె రాకుండా నిషేధం విధించారు. తను చింపాంజిని ప్రేమిస్తున్నానని, ఆ మాత్రానికే రాకుండా నిషేధం విధించడం సరికాదని ఎడి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.