పాఠశాలల్లో మౌళిక వసతులు: ఎమ్మెల్యే

రథసారథి. మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణం లో తెలంగాణ రాష్ట్ర గౌరవ CM శ్రీ. KCR గారి మానస పుత్రిక అయిన మన ఊరు,మన బడి- మన బస్తీ , మన బడి పథకం కింద– ఈ రోజు 11 వ వార్డు నందిపహాడ్- ప్రాధమిక పాఠశాల నందు 70 లక్షల 74 వేల 678 రూపాయలతో మరియు 36 వ వార్డు మెయిన్ బజార్ – ప్రాధమికొన్నత పాఠశాల – గాంధీ పార్క్ నందు 1 కోటి 88 లక్షల 39 వేల 598 రూపాయలతో అదేవిదముగా 34 వ వార్డు గాంధీనగర్ – ZPHS (బాలికల పాఠశాల) నందు 1 కోటి 46 లక్షల 90 వేల 747 రూపాయల వ్యయంతో నిర్మాణ పనులకు తెలంగాణ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ తో కలిసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శంఖుస్థాపన చేయడం జరిగింది.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధముగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నారని తెలిపారు. మొదటి దఫా కింద నియోజక వర్గములో 70 పాఠశాలలు పునరుద్ధరించటానికి 40 కోట్ల 68 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని మిగతా పాఠశాలలు కూడా రెండవ దఫాలో చేర్చి వాటిని కుడా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మన ఊరు,మన బడి- మన బస్తీ మన బడి పథకం కింద ప్రతి పాఠశాల లో నిరంతరం నీరు, మరుగుదొడ్లు, విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్, ప్రహరీ గోడలు, వంట గది, అదనపు గదుల మరమ్మతులు, డిజిటల్ తరగతులు వంటి అన్ని సదుపాయాలు కల్పిండమే కాకుండా ఆధునిక వసతులు ఉండేలా చూసి పాత భవనాలను అధునికరిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి ,ఎంపిపి నూకల సరళ హనుమంతు రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ చిట్టిబాబు,బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు కర్నే ఇందిరా గోవింద్ రెడ్డి, ఉబ్బపల్లి వెంకమ్మ సోములు, అన్నభీమోజు నాగార్జున చారి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్దూం పాషా, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, పాలరాపు సత్యనారాయణ, మన్నెం లింగా రెడ్డి, ఉబ్బపల్లి మధుసూదన్ రావు, సాధినేని శ్రీనివాస రావు,మాలోతు రవీందర్, వీరా రెడ్డి, నల్లగంతుల నాగభూషణం, వంశీ, సుధాకర్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, ఏం ఈ వో మాలోతు బాలాజీ నాయక్, పంచాయతి రాజ్ శాఖ డి ఈ ఈ ముత్తవరపు వెంకటేశ్వర రావు, ఏ ఈ ఈ చిల్లంచర్ల ఆదినారాయణ, పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.