నూతన సంవత్సరం క్యాలెండర్ విడుదల

రథ సారథి, మిర్యాలగూడ :
స్థానిక నవజీవన్ హైస్కూల్ లో శనివారం నాడు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ -2 పోలీస్ ఇన్స్పెక్టర్ సురేష్ విచ్చేశారు. వారి చేతులు మీదుగా నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అదే విధంగా న్యూ ఇయర్ కేకే కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ లు అతిగా వాడవద్దని,నేర ప్రవృత్తి నీ అలవరచుకోవద్దని హితవు పలికారు.
ఈ కార్యక్రమానికి స్కూల్ కరస్పాండెంట్ శ్రీ రామకవచం నాగరాజు అధ్యక్షత వహించారు. ప్రిన్సిపల్ విజయ కుమారీ, డైరెక్టర్ నాగమణి పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు వాజిద్, పురుషోత్తం రెడ్డి,శ్రీధర్,శ్రీనాథ్, పాపయ్య, వెంకటేశ్వరలు, రామారావు,పద్మ,సరస్వతి,హైమవతి,అరుణ,ఆసియా,మహేశ్వరి, విజయలక్ష్మి, అర్పిత, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్దులకు బహుమతులు అందచేశారు.

Leave A Reply

Your email address will not be published.