మంత్రిచే గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

రథ సారథి, సూర్యాపేట:

తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్, డైరీ లను ఈ రోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట లో మినిష్టర్ క్వార్టర్ నందు ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామావత్ నాగేశ్వర్ రావు, కొర్ర కృష్ణ కాంత్ నాయక్ మరియు రాష్ట్ర నాయకులు బానావత్ సైదులు నాయక్,మూడ్ తిరుపతి నాయక్,జిల్లా నాయకులు శ్రీనివాసరావు, శంకర్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం వారి ఆధ్వర్యం లో ఫిబ్రవరి 15 న బంజారాల ఆరాధ్య దైవం శ్రీశ్రీశ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి రోజున ఉద్యోగులకు సెలవు ప్రకటించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా నాయకులు రామా నాయక్, భగ్గు నాయక్, వస్రం నాయక్, గౌతం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.