నియోజక వర్గ అధ్యక్షునిగా నరేష్ నియామకం

రథ సారథి, మిర్యాలగూడ:

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ,తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మట్ట రాజు యాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ బిసి యువజన సంక్షేమ సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులుగా ఆకిటి నరేష్ ముదిరాజ్ ని నియమిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. మిర్యాలగూడ లో సోమవారం నరేష్ కి నియామక పత్రం అందజేశారు. అనంతరం నరేష్ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా బీసీ సమస్యలను పరిష్కారం చేసే దిశగా బీసీలందరిని చైతన్యవంతులు చేస్తాను అన్నారు .యువకులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, బీసీ సంఘం నాయకులు సూర్య తేజ ,రామరాజు యాదవ్, శ్రీకాంత్ ,గోపి గౌడ్, నవీన్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.