అమరవీరుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలి: జాజుల
రథ సారథి,మిర్యాలగూడ:
తెలంగాణ మలిదశ ఉద్యమ వీరుడు,అమరుడు సిరిపురం యాదయ్య 13వ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపం వద్ద ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ సిరిపురం యాదయ్య తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో క్రియాశీలకంగా పాల్గొన్నాడని,ఉద్యమ సమయంలో 2010 ఫిబ్రవరి 20న ఉస్మానియా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. సమైఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడలు వంచి ఎలాగైనా ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవాలన్న ఉద్ధేశ్యంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రవేశద్వారం ఎన్‌సీసీ గేట్ వద్ద 2010 ఫిబ్రవరి 20న యాదయ్య తన ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకొని తన శరీరం కాలుతున్నా జై తెలంగాణ అంటూ నినాదాలు చేశాడని అన్నారు.అమరుల త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది. అమరుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, కుమ్మరికుంట్ల సుధాకర్, చేగొండి మురళి యాదవ్, దాసరాజ్ జయరాజ్, మల్లికంటి వెంకటయ్య, ఈనుగంటి తిరుపతయ్య,బొడ్డు సైదులు, హరి తదితరులు పాల్గొన్నారు.