తాలిబన్ టూ తాలిబన్: చైనా ఎగతాళి

బీజింగ్: అదను దొరికితే చాలు అమెరికా దేశాన్ని ఏకేయడానికి చైనా దేశం ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. గత రెండు దశాబ్ధాలలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో సాధించింది ఏమీ లేదని తాలిబన్ టూ తాలిబన్ తెచ్చిందని ఎగతాళి చేసింది.

ఆఫ్ఘన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణమని చైనా మీడియా జిన్హూవా న్యూస్ ఏజెన్సీ ఒక వీడియో ను టెలికాస్ట్ చేసింది. మూడు నిమిషాల వీడియోలో అమెరికా వైఖరిని తూర్పారబట్టింది. అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ చేసిన అమెరికా ఈజ్ బ్యాక్ అనే వ్యాఖ్యలు నిజం అయ్యాయని యాంకర్ ఎగతాళి చేసింది. నలుగురు అధ్యక్షులు, 20 సంవత్సరాలు, 2 ట్రిలియన్ డాలర్లు, 2300 మంది ఆర్మీని పణంగా పెట్టి ఆఫ్ఘన్ లో తాలిబన్ల పాలన నుంచి తిరిగి తాలిబన్ల పాలనకే చేరుకుందని జిన్హుహా న్యూస్ పోస్టు చేసింది. ఆ దేశ అధ్యక్ష భవనాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తరువాత ఖాళీ చేయడానికి అమెరికా దళాలు తర్జనభర్జనపడ్డాయి. ఉగ్రవాదం నిరోధించడం పేరుతో ఆఫ్ఘన్ లో యుద్దాన్ని రాజేసిందని చైనా తూర్పారబట్టింది. గత రెండు దశాబ్ధాలలో అమెరికా సాధించిన ఘనత ఏంటంటే ఉగ్రమూకల తండాను సింగిల్ డిజిట్ నుంచి డబుల్ డిజిట్ కు పెంచిందని చైనా ఎత్తిపొడిచింది. అమెరికా వల్ల ఇప్పటి వరకు లక్ష మంది ఆఫ్ఘన్ వాసులు చనిపోయారు లెక్కకు మించి పౌరులు ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వియత్నాం యుద్దం కన్నా ఎక్కువ నష్టాన్ని మిగిల్చిందని చైనా అమెరికాను నిందించింది.

 

Leave A Reply

Your email address will not be published.