సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

రథసారథి,మిర్యాలగూడ :
మాడ్గులపల్లీ మండల పరిదిలోని 4 గ్రామాలకు (ఇస్కబావిగుడెం, తోపుచర్ల, కుక్కడం, చిరుమర్తి,) ఎస్డిఎఫ్ (స్పెషల్ డెవెలప్ మెంట్ ఫండ్) గ్రాంటు ద్వారా గ్రామానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం మంజూరు అయిన రూ.80లక్షల రూపాయల నిధులతో నూతన సి.సి రోడ్ల నిర్మాణ కార్యక్రమాలకు ఈరోజు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, మండల పార్టీ అద్యక్షులు పాలుట్ల బాబయ్య, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల శ్రీరాములు గౌడ్, సీనియర్ నాయకులూ పొనుగోటి చొక్కారావు, మండల కో ఆప్షన్ సభ్యులు షైక్ మౌలాలి, సర్పంచ్లు అల్గుబెల్లి గోవిందరెడ్డి, నిమ్మల గోవిందమ్మ, మారుతి వెంకట్ రెడ్డి, శ్రీశైలం, మంగా యాదయ్య, సైదులు, ఎం.పీ.టీ.సీ కత్తి కనకా రెడ్డి, కళింగ రెడ్డి, నాయకులూ నిమ్మల నవీన్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, యతం నరేందర్ రెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ డీ ఈ వెంకటేశ్వర్ రావు, ఎమ్డీఓ మేకల నాగయ్య, కూరేళ్ళ వెంకట చారి, ఎరేడ్ల అంజి రెడ్డి, నకిరేకంటి శ్రీను, గోపాల్ రెడ్డి, శర్మ, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పార్టీ అద్యక్షులు, ఏఈ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.