జిల్లా సాంఘిక శాస్త్రం నూతన కార్యవర్గం
రథ సారథి,మిర్యాలగూడ:
నల్లగొండ యందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సాంఘిక శాస్త్ర ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఇందులో జిల్లా అధ్యక్షుడిగా నల్ల మేకల మేకల వెంకయ్యను, ప్రధాన కార్యదర్శిగా ఎల్. కోటయ్య ను నియామకం చేశారు .అదే విధంగా వివిధ డివిజన్లకు బాధ్యులను నియమించడం జరిగింది మిర్యాలగూడ డివిజన్ కు అధ్యక్షులుగా పులిపారు సత్యనారాయణ ,ప్రధాన కార్యదర్శిగా ఎండి రహీం , నల్లగొండ డివిజన్ కి అధ్యక్షుడిగా ఎన్. సైదులు ప్రధాన కార్యదర్శిగా లింగయ్య , దేవరకొండ డివిజన్ కు అధ్యక్షులుగా జే.బక్కయ్య ప్రధాన కార్యదర్శిగా ముసిని కృష్ణవేణి గారు ఏన్నికయ్యినట్లు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు. వీరి నియామకం పట్ల ఉపాధ్యాయులు వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి నరసింహ నాయక్, మాలిసైదులు ,చల్లా రవి నాగేశ్వరరావు ,కల్పన, రజిత రామ తులసి, రమేష్, శ్రీనివాస్ నాయుడు లింగారెడ్డి ,తదితరులు హర్షం వ్యక్తం చేశారు