రావులపెంటలో మనసాక్షి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

రథ సారథి, వేములపల్లి :మన సాక్షి దిన పత్రిక 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను సోమవారం వేములపల్లి మండలం రావులపెంట గ్రామ సర్పంచ్ దొంతి రెడ్డి వెంకట్ రెడ్డి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పత్రికలు ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా వ్యవహరిస్తున్నాయన్నారు. జర్నలిస్టులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనసాక్షి పత్రిక మిర్యాలగూడ టౌన్ విలేకరి శీలం వినయ్ గౌడ్, పంచాయతీ సెక్రెటరీ రాంరెడ్డి, టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చంద్రయ్య, వార్డు మెంబర్లు శీలం సైదులు గౌడ్, వంగల సంజీవ చారి, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.