హలో బీసి.. ఛలో ఢిల్లీ కరపత్రాల విడుదల

రథ సారథి, మిర్యాలగూడ :
దేశవ్యాప్తంగా జరగబోయే జనాభా లెక్కలలో బీసీలను కులాల వారీగా లెక్కించాలని డిమాండ్ చేస్తూ, సమగ్ర కులగనన సాధన కోసం ఫిబ్రవరి 5, 6, 7 తేదీలలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తలపెట్టిన హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమం కరపత్రాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్క రించారు.అనంతరం నాయకులు మాట్లాడుతూ విద్యా ఉద్యోగ రంగంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీసీలకు 50% రిజర్వేషన్లు కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టాలన్నారు. అదేవిధంగా కేంద్ర క్యాబినెట్లో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు దేశవ్యాప్తంగా బీసీలు 60 శాతం ఉన్నప్పటికీ బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్లు 27% అయినప్పటికీ అమలవుతున్నది 15 శాతం అన్నారు.బీసీలు ఇకనైనా మేలుకోకపోతే బీసీల భవిష్యత్తు షరాఘాతమవుతుంది అన్నారు.కావున బీసీలు ఇప్పటికైనా మేల్కొని ఫిబ్రవరి ఆరు 5, 6, 7 తేదీలలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ జంతర్ మంతర్ లో తలపెట్టిన తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని బీసీ సమాజమంతా ఏకమై విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అన్న బీమోజు నాగార్జున చారి, పిసిసి రాష్ట్ర కార్యదర్శి చిరుమరి కృష్ణయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి డబ్బికార్ మల్లేష్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బంటు సైదులు,టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్కౌ,కౌన్సిలర్ భాషా నగిరి, విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మారం శ్రీనివాస్, వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు వేముల సుధాకర్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు సరికొండ రామకృష్ణ రాజు,జయరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుణగంటి వెంకన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ,జిల్లా ఉపాధ్యక్షులు వేముల రామకృష్ణ,గౌడ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు గుండు శ్రీరాములు గౌడ్, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి చేగుంట మురళి యాదవ్, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షులు నల్లగంతుల నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.