అంధత్వ నివారణే ధ్యేయం: గుత్తా

రథ సారథి, మిర్యాలగూడ:
అంధత్వ నివారణతో
అంధులు లేని తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు.గురువారం వేములపల్లి మండల కేంద్రంలోని రైతు వేదిక, షాబు నగర్ లోని రైతు వేదిక (ఎం.పి.డి.ఓ కార్యాలయం), బాపూజీ నగర్ వడ్డెర కమ్యూనిటీ హాల్ మరియు వెంకటాద్రిపాలెం గ్రామం నందు గల గోపాల మిత్ర సబ్ సెంటర్ నందు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణలో అంధత్వ నివారణ ధ్యేయంగా ప్రభుత్వం కంటి వెలుగును ప్రారంభించింది అన్నారు. ఈ పథకాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు భార్గవ్ , కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ కుష్బు , ఆర్.డి.ఓ చెన్నయ్య , ఎంపీపీ లు నూకల సరళ హనుమంత్ రెడ్డి, పుట్టల సునీత కృపయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, మాజీ మున్సిపల్ చైర్ ప ర్సన్, కౌన్సిలర్ తిరునగరు నాగలక్ష్మి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, వైస్ ఎంపిపి పాదురి గోవర్ధని, అమరావతి సైదులు, మిర్యాలగూడ మండల రైతు బంధుసమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, డిప్యూటీ డిఎంహెచ్వో కేస రవి, మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సాగర్, పాక్స్ చైర్మన్ జేర్రిపోతుల రాములు గౌడ్, బి.ఆర్.ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ ఉదయ భాస్కర్, నాయకులు కట్టా మల్లేష్ గౌడ్, మదార్ బాబా, పత్తిపాటి నవాబ్, ఉబ్బపల్లీ మధు, మెప్మా అధికారి బక్కయ్య, సర్పంచులు చిర్ర మల్లయ్య యాదవ్, బారెడ్డి అశోక్ రెడ్డి, మాలవత్ రవీందర్, మాజీ ఎంపిపి ఓగ్గు జానయ్య, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, సందేషి అంజన్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.