కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై రాజీ లేని పోరాటాలు

రథ సారథి, మిర్యాలగూడ:

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 98వ వార్షికోత్సవాల సందర్భంగా మిర్యాలగూడలోనీ సాగర్ రోడ్డులో సిపిఐ పార్టీ జెండాను సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26 తారీఖున ఖాన్ పూర్ లో కొంతమందితో ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ రోజు భారతదేశవ్యాప్తంగా విస్తరించి పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పట్ల ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద రాజీలేని పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. పేద ప్రజల కండగా ఉంటూ ముందుకు సాగుతుంది దున్నే వాడికి భూమి కావాలని 10 లక్షల ఎకరాలు పంచిన ఘనమైన చరిత్ర ఈ భారత కమ్యూనిస్టు పార్టీకి ఉన్నది అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ధరలు అందుబాటులో లేకుండా పోయినవి అనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు. ఈ బిజెపి ప్రభుత్వాహంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, పేద మధ్య తరగతి ప్రజలు బ్రతకటానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇవ్వకపోగా ఇప్పుడు స్థలాలు ఉన్నవారికి కేవలం మూడు లక్షల రూపాయలు ఇస్తాను అనటం సరైంది కాదన్నారు. సిపిఐ పార్టీ భవిష్యత్తులో పేద ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పై  రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తామని వారన్నారు. సిపిఐ మండల కార్యదర్శి ఎండి సయ్యద్, రైతు సంఘం బిల్లా కనకయ్య, వార్డు నెంబరు దేవరకొండ చంద్రమౌళి, ఏ. రామలింగం, వర్ధన్, లింగయ్య ,బలరాం, మహిళా సమైక్య నాయకురాలు దాసర్ల దుర్గమ్మ ,ఎస్కే షమీ,బంటు రేణుక, ఎర్రబోతు పద్మ, బంటురాజేశ్వరి, లింగంపల్లిసైదమ్మ, బంటు దేవి వరప్రసాద్, లీల, పద్మ, సరళ, రేణుక, నర్సమ్మ, నర్మదా, మచ్చ శైలజ, వెన్నెల, వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.