శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ నూతన పాలకవర్గం ఎన్నిక

రథ సారథి, వరంగల్:

వరంగల్ జిల్లా   పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర పంచాయతీరాజ్  & గ్రామీణాభివృద్ధి  శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేవస్థానం నూతన కమిటీ చైర్మన్ గా రెండవ సారి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన రామచంద్రయ్య శర్మ , ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులను మంత్రి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మంచి పండితుడు, మంచి వ్యక్తి అయిన వెనుక దాసుల రామచంద్ర శర్మ కు,ధర్మకర్తలకు మరో మారు అవకాశం వచ్చిందని, నీతి నిజాయితీగా పని చేసే రామచంద్ర శర్మ దేవస్థాన అభివృద్ధికి ఇప్పటికే తమ వంతు పాత్ర పోషిస్తున్నారని మంత్రి అన్నారు.అనంతరం మంత్రి ఎర్రబెల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సునీత, ఇన్స్పెక్టర్ కవిత, ఈవో రజిని కుమారి, పలువురు నాయకులు ఆలయ పూజారులు,పాలకుర్తి మండల యువజన నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.