పంట పొలాలను ఆదుకోవాలి: జూలకంటి

రథ సారథి, మిర్యాలగూడ:

తెగులు,వైరస్ సోకి ఎర్రబారిన పంట పొలాలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.సోమవారం వేములపల్లి మండలంలోని సాగర్ ఆయకట్టు ప్రాంతంలో వరి పంట పొలాలను సిపిఎం నాయకులతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి నాట్లు వేసుకుని నెల రోజులు పూర్తయి ఇప్పుడిప్పుడే పిలక దశలో ఉన్న ఈ సమయంలో వరి పంట పొలాలు తెగులు,వైరస్ సోకి ఎర్రబారిపోయి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్ని రకాల మందులు కొట్టినా పంటలో ఏమాత్రం మార్పు రాకపోవడంతో అప్పుచేసి వ్యవసాయం చేస్తున్న రైతులు,కౌలు రైతులు పంట దిగుబడి రాదేమోనని,తీవ్రంగా నష్టపోతామేమోనని ఆందోళన పడుతున్నారని అన్నారు.ప్రభుత్వ అధికారులు,వ్యవసాయ అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ తెగులు వైరస్ నుండి రైతాంగం బయటపడి యధావిధిగా వరి పంటను రక్షించుకోవడానికి ఎటువంటి రకాల మందులు వాడాలో పూర్తి అవగాహన చేపట్టాలని తెలియజేశారు. ఇప్పటికైనా సాగర్ ఆయకట్టు ప్రాంతంలో ఉన్నటువంటి వరి పంట పొలాలను ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షించి ఇటువంటి వైరస్ తెగులు బారిన పడినటువంటి పంట పొలాలను గుర్తించి తగు చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.లేనిపక్షంలో రైతులందరినీ ఏకం చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వేములపల్లి మండల వైస్ ఎంపీపీ పాదూరు గోవర్ధన,సిపిఎం మండల కార్యదర్శి పాదూరు శశిధర్ రెడ్డి, మరియు నాయకులు పాల్వాయి రాం రెడ్డి,వెంకన్న,వెంకటయ్య,సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.