బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

రథ సారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణంలోని 34 మరియు 35వ వార్డ్ ల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద వెంకటేశ్వర్లు, దైద రాజు మరియు అనుచరులు, సుమారు 200 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో, బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అద్యక్షులు, మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ , పార్టీ పట్టణ ఉపాద్యక్షులు ఉబ్బపల్లీ మధుసూదన్ మరియు పట్టణ బీ ఆర్ ఎస్ పార్టీ ఎస్.సి కమిటి అద్యక్షులు, మాజీ కౌన్సిలర్ దైద సోముసుందర్ నేతృ త్వంలో ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నందు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీ ఆర్ ఎస్ పార్టీలొ చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారికి బీ ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, పార్టీ పట్టణ ఉపాద్యక్షులు బాసాని గిరి, ఎం.డి షోయబ్, నల్లగంతుల నాగభూషణం, సర్పంచులు లావురి శ్రీను నాయక్, దొంతిరెడ్డి వెంకట్ రెడ్డి, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఫయాజ్, శివ, దైద కృష్ణ, కందికంటి రమేశ్, కె.విష్ణు, డి.రాందాస్, ఈట గిరి, కె.సైదులు, డి.సైదులు, పి.వెంకటేశ్వర్లు, కె.వెంకటేష్, ఆర్.రోహిత్, శశి, ఎ.విజయ్, ఉబ్బపల్లీ రాజు, దాసరి సతీష్, డి.నాగరాజు, ఉదయ్, డి.ప్రణీత్, వి.శ్రీను, ఆర్.సైదులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.