మున్సిపల్ ఛైర్మన్ భార్గవ్ చొరవతో లైట్ల ఏర్పాటు

రథ సారథి మిర్యాలగూడ:

మిర్యాలగూడ పట్టణం లోని స్థానిక హౌసింగ్ బోర్డు ప్రధాన రోడ్డు పై ప్రధాన వీధి లైట్ల ఏర్పాటు ప్రక్రియ మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ చొరవతో ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ ప్రథాన రహదారిపై గత కొద్ది నెలల నుండి లైట్లు లేక చీకట్లు అలముకున్నాయి. ఈ కారణంగా ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.ఇది ముఖ్యంగా కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారి కావడంతో హైవే విభాగం వారు లైట్లు అమరుస్తారు అనీ మున్సిపాలిటీ వారు వేచి చూశారు. కానీ వారు పట్టించుకోక పోవడంతో,స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధుల వినతి మేరకు ఎట్టకేలకు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ ఈ మార్గంలో లైట్ల ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా మున్సిపల్ సిబ్బంది యంత్రాల సాయంతో లైట్ల ఏర్పాటు ప్రక్రియ ప్రారం భించారు. మొత్తం లైట్ల ఏర్పాటు అనంతరం ఈ మార్గంలో వీధి లైట్లు వెలిగిస్తాం అనీ మున్సిపల్ చైర్మన్ తిరు నగరు భార్గవ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.