బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ముట్టడి

రథసారథి, మిర్యాలగూడ:
బిసి ,ఎస్సి ,ఎస్టి విద్యార్థుల ఫీజు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని ,పెరిగిన ధరల ప్రకారం హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు
బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు ఆర్డీవో ఆఫీసుని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ పై ఆధారపడి చదువు కొనసాగిస్తున్నారు అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థుల ఫీజులు పెండింగ్లో ఉండడం వలన కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నా యన్నారు. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వం కేవలం 1500 రూపాయలు మాత్రమే ఇవ్వడం వలన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందక అనారోగ్య సమస్యల భారిన పడుతున్నారు అన్నారు.కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి హాస్టల్ విద్యార్థులకు నెలకు 4000 రూపాయలను చెల్లించాలని కోరుతూ ఇంజనీరింగ్ చదివే బీసీ విద్యార్థులకు పదివేల ర్యాంకు నిబంధన ఎత్తివేసి ప్రతి బీసీ విద్యార్థికి పూర్తి ఫీజు ప్రభుత్వమే చెల్లించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వ అందించాలని కోరుతున్నాము .బీసీ విద్యార్థుల పెండింగ్ ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేకపోవడం వలన చాలామంది విద్యార్థులు చదువులు మధ్యలోనే మానివేసి కూలీ పనులు చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ని విడుదల చేసి హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచకపోతే పెద్ద ఎత్తున ప్రగతిభవాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పగిడి జిడయ్యా,పొలాగని వెంకటేష్, పొలిశెట్టి అజయ్,అనిల్,పల్లా వెంకన్న,రాంబాబు ,శ్రీను ,రాజేష్ ,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.