అంధత్వ రహిత సమాజమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి తలసాని
రథ సారథి,హైదరాబాద్:
అంధత్వ రహిత సమాజమే కేసీఆర్ లక్ష్యం అనీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని
గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని విక్టోరియా గ్రౌండ్ లో,
నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని విజయనగర్ కాలనీలోని ఫుట్ బాల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను మంత్రి మంగళవారం సందర్శించారు.
కంటి చూపు సంబంధ సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు మెరుగైన చూపు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు .
దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారనీ మంత్రి తలసాని పేర్కొన్నారు.
ఈ కంటి వెలుగు శిబిరాల్లో
ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, కళ్ళద్దాలు పంపిణీ చేయడం జరుగుతుంది అన్నారు.
అవసరమైన వారికి ఆపరేషన్ లు కూడా ఉచితంగానే చేయబడుతుంది అన్నారు. ఇప్పటివరకు సుమారు 6.22 లక్షల మందికి కంటి పరీక్షలు చేపట్టామన్నారు .ప్రజలు ఇలాంటి మంచి కార్య క్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని సూచించారు.