TUWJ 143 యూనియన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ అస్లం నియామకం

రథసారథి:

మిర్యాలగూడ, తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్(TUWJ-H 143) యూనియన్ నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్, మహమ్మద్ అస్లం ఏకగ్రీవంగా నియామకమయ్యారు.. సోమవారం
ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాసభలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ జరిగినాయి. ఉమ్మడి జిల్లా మహాసభను రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, తెంజు రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్ ల సమక్షంలో ఉమ్మడి నల్గొండ జిల్లా మహాసభలో అస్లాంను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు.అస్లం జర్నలిస్టుగా 1993 సంవత్సరం నుంచి పనిచేస్తున్నారు. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాAPUWJ కార్యదర్శిగా, తెలంగాణ జర్నలిస్టు ఫోరం(TJF) జిల్లా కార్యదర్శిగా, మిర్యాలగూడ నియోజకవర్గ TJF అధ్యక్షులుగా, మిర్యాలగూడ పట్టణ ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పని చేసిన అనుభవం కలదు. 29 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్ గా పని చేస్తూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తూ సేవలందిస్తున్నందు గాను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన అస్లంను జిల్లాకు చెందిన పలువురు జర్నలిస్టులు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.