గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే భాస్కర్ రావు

రథ సారథి ,మిర్యాలగూడ:

సి.ఎం కప్ జిల్లా స్థాయి క్రీడాపోటిల్లో మొదటి బహుమతి సాదించిన కబడ్డీ క్రీడాకారులను శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు  అభినందించారు, సమిష్టి కృషితో మిర్యాలగూడ కబడ్డీ జట్టు మేకల అభినవ్ స్టేడియం లో ఉత్తమ ప్రతిభ కనబరచి జిల్లా స్థాయిలో మొదటి బహుమతి సాదించిందని ఇదే స్పూర్తితో రాష్ట్ర స్థాయిలో రాణించి నల్లగొండ జిల్లా కు గుర్తింపు తేవాలని ఆశించారు, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలను ప్రోత్సహించుటకు ప్రతి గ్రామ పంచాయతిలలో క్రీడామైదానాలను నెలకొల్పి క్రీడా నైపుణ్యాలను పెంపొందించుటకు కృషి చేస్తుందని క్రీడాకారుల అభిరుచులకు అనుగుణంగా నైపుణ్యం పెంపొందించుకొని రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలలో ప్రతిభ అవార్డ్లను పొందాలని తెలిపారు, ప్రభుత్వ గుర్తింపు పొందిన సర్టిఫికెట్స్ పొంది ఉద్యోగ ఉపాది రంగాల్లో రాయితీలు పొంది, ఉద్యోగాల్లో స్థిరపడవచ్చునని పేర్కొన్నారు, వ్యాయమ ఉపాద్యాయుల కోరిక మేరకు ఇండోర్ స్టేడియంలో అదునిక సోకర్యలతో కూడిన కబడ్డీ కోర్ట్ ను నిర్మిస్తానని హామీ ఇచ్చారు, ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహించుటకు మండల పరిషద్ అద్యక్షురాలు  నూకల సరళ హనుమంత్ రెడ్డి  క్రీడా దుస్తుల తో పాటు రూ. 5 వేల నగదు ప్రోత్సాహం అందించారు, మండల పరిషద్ అభివృద్ధి అధికారిణి శ్రీమతి.గార్లపాటి జ్యోతి లక్ష్మి గారు కూడా క్రీడాకారులను ప్రోత్సహించుటకు 3 వేల రూపాయల నగదును అందజేసారు, ఈ కార్యక్రమంలో మండల విద్యాదికారి బాలాజీ నాయక్, వ్యాయమ ఉపాద్యాయులు వెంకట రత్నం, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, సైదులు పాల్గొన్నారు…

Leave A Reply

Your email address will not be published.