రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

రథసారథి,మిర్యాలగూడ:
ఈ రోజు మిర్యాలగూడ మండలంలో ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి సామ్య గాని తండ గ్రామం వరకు రూ. 68 లక్షల వ్యయంతో రోడ్డు నిర్మాణానికి మరియు శ్రీనివాస్ నగర్ గ్రామములో రూ. 10 లక్షల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తెలంగాణ అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహ రెడ్డి , నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి , ఎంపీపీ నూకల సరళ హనుమంతు రెడ్డితో కలిసి శంఖుస్థాపన చే సారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్ద కాలంగా ఆర్ అండ్ బీ రోడ్డు నుంచి సామేగాని తండ వరకు రోడ్డు నిర్మాణం తీవ్ర జాప్యానికి గురి అయిందని దానిని ఇప్పుడు సాకారం చేసుకోవడం జరుగుతుందని.. అదేవిధముగా ప్రజల కోరిక మేరకు సామేగాని తండా ను గ్రామ పంచాయతిగా కుడా చేసుకోవడం జరిగిందని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. నియోజక వర్గములో అన్ని గ్రామ పంచాయతిలలో మౌలిక సదుపాయాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తూ అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమములో మాజీ ఏఎంసీ చైర్మన్ చిట్టిబాబు, మండల రైతు బంధు సమితి అధ్యక్షులు గడగోజు ఏడుకొండలు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు భోగవిల్లి వెంకటరమణ చౌదరి, సర్పంచ్ ధనావత్ సైదా నాయక్, ఎంపిటిసి ఇస్లావత్ సుజాత బాలు నాయక్, చిలుకూరి సత్యనారాయణ, మాజీ ఏ ఎమ్ సీ డైరెక్టర్ పులి జగదీష్, సైదా నాయక్, శ్రీహరి నాయక్, బీ ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ప్రసాద్, వాసంశెట్టి గోవిందు, పంచాయతి రాజ్ శాఖ డి ఈ ఈ ముత్తవరపు వెంకటేశ్వర రావు, ఏఈఈ చిల్లంచర్ల ఆదినారాయణ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.