రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ భారతి

 

రథ సారథి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ భారతీ రాగ్య నాయక్,  ఆమె కుమారుడు స్కైలాబ్ నాయక్ , దామరచర్ల మండల ఎంపీపీ నందిని రవితేజ లు శుక్రవారం హైదరాబాదులో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్గొండ జిల్లాలో గిరిజనులలో పట్టు ఉన్న నేతలు మాజీ ఎమ్మెల్సీ దిరావత్ భారతీ రాగ్యనాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దిరావత్ స్కైలాబ్ నాయక్, దామరచర్ల మండలం ఎంపీపీ నందిని రవితేజ, దామరచర్ల మండ లానికి చెందిన బాండవత్ తండా గ్రామ సర్పంచ్ మరో ఐదుగురు మాజీ సర్పంచులు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారందరూ కూడా శుక్రవారం హైదరాబాదులో తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు . వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ లో వీరి చేరికతో మిర్యాలగూడ నియోజకవర్గంలో రాజకీ యాలు మరింత వేడెక్కాయి అనీ విశ్లేషకులు భావిస్తున్నారు .ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుందురు రఘువీర్ రెడ్డి, నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ ,మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి , టీపీసీసీ సభ్యులు చిరుమర్రి కృష్ణయ్య,బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొదిల శ్రీనివాస్, మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.