ఎమ్మెల్యే సైదిరెడ్డికి మద్దతు తెలిపిన నాయి బ్రహ్మాణ సేవా సంఘాలు.

రథ సారథి, హుజూర్ నగర్:

 

మంగళవారం హుజూర్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులకు చెందిన వారు నాయి బ్రహ్మాణ సేవా సంఘం పట్టణ కమిటీ మరియు హుజుర్ నగర్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువతో సన్మానించారు.  పూలమాలలతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి  శానంపూడి సైదిరెడ్డి కి వారు సంపూర్ణ మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి  మాట్లాడుతూ..నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ, సోదర సోదరీమణులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అనీ తెలిపారు.

నాయి బ్రాహ్మణుల ఉపాధి కోసం మోడ్రన్ హెయిర్ సెలూన్ లు ఏర్పాటు చేశామనీ,200 యూనిట్ల కరెంట్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది అని,నాయి బ్రహ్మాణ పేద కుటుంబాలను ఆదుకుంటాం అనీ,ప్రభుత్వ సంక్షేమ పథకాలలో అవకాశాలు కల్పిస్తాము. అని అన్నారు.ఇప్పటికే బీసీ బందు అమలు చేస్తున్నాము అనీ , కొత్త సెలూన్లు  ఏర్పాటు చేయడం జరిగింది అనీ,బీసీ బందు కూడా అమలు చేయడం జరిగింది  అని ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా పలువురు నాయి బ్రాహ్మణులు  మాట్లాడుతూ..నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు సైదిరెడ్డి అని,వారు చేస్తున్న అభివృద్ధి కి,సంక్షేమ పథకాలకు మరియు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కి ఆకర్షితులమై, మన ప్రాంత అభివృద్ధిని చూసి మన హుజుర్ నగర్ ప్రాంత వాసి, అభివృద్ధి ప్రదాత, శానంపూడి సైదిరెడ్డి ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల లో భారీ మెజారిటీతో గెలిపించుకుని మన ప్రాంత అభివృద్ధిని కొనసాగిద్దామని తెలియజేశారు.

 

 

Leave A Reply

Your email address will not be published.