గులాబీ మయమైన నాగార్జునసాగర్ …

 

భగత్ కుమార్ కు భారీ స్వాగతం

రథ సారథి, నాగార్జునసాగర్ :

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పైలాన్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ఇంచార్జ్ ఎమ్మెల్సీ కోటిరెడ్డి,రాష్ట్ర నాయకులు కడారి అంజయ్య యాదవ్ తో కలిసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా భగత్ కుమార్ ను ఆశీర్వదించడానికి పైలాన్ మొత్తం కదిలి వచ్చింది.మహిళలు, ప్రజలు భారీ ర్యాలీతో ఘనస్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భగత్ కుమార్ మాట్లాడుతూ 36ఏళ్ళుగా సాగర్ ప్రజల మొహం కూడా సరిగ్గా చూడని జానారెడ్డి, ఆయన తనయుడు ఇవ్వాళ్ళ ఓట్ల కోసం కోట్లు పట్టుకొని బయలుదేరాడు అనీ విమర్శించారు.పుట్టిన బిడ్డ తల్లి దగ్గర ఉంటే ఎంత క్షేమంగా ఉంటుందో నాగార్జునసాగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పాలనలోనే సుభిక్షంగా ఉంటుంది అని ఆయన తెలిపారు.ప్రజలందరూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కర్ణ అనుష-శరత్ రెడ్డి, సీనియర్ నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, జెడ్పిటిసి అబ్బిడి కృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు బత్తుల సత్యనారాయణ,బుసరాజుల కృష్ణ , మున్సిపల్ వైస్ చైర్మన్ బిన్నీ , పట్టణ యూత్ అధ్యక్షులు ఆవులదొడ్డి రాహుల్, మున్సిపల్ కౌన్సిలర్ మంగత్ నాయక్, శిరీష -మోహన్ నాయక్, రమేష్ జి, శివ, హర్ష, హాజీ, అర్జున్, భాస్కర్, కిషోర్, బహదుర్,చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.