పేదల గొంతుక రంగన్నను గెలిపించండి

 

మిర్యాలగూడ ప్రచారంలో విజయన్ రాఘవన్

రథ సారథి, మిర్యాలగూడ:

పేదల గొంతుకగా నిరంతరం ప్రజల పక్షాన పోరాడే రంగన్నను గెలిపించాలని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఎంపీ విజయన్ రాఘవన్ కోరారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ మండలంలోని గూడూరు లక్ష్మీపురం గ్రామాలలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక, రైతాంగ, ఉద్యోగ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారన్నారు. రంగన్న లాంటి నాయకులు అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని పేదల గొంతుకగా నిలిచి మీకు అండగా నిలుస్తా అన్నారు. కమ్యూనిస్టు నాయకులే అన్ని వర్గాల ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని చెప్పారు. సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ డబ్బు ప్రలోభాలకు గురికాకుండా అందరి కోసం పనిచేసే నాయకులను గెలిపించాలని కోరారు. కార్మికులు రైతులు రైతు కూలీల కోసం పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ అభ్యర్థులు పల్నాడు రాజకీయం చేస్తారని వారిని గెలిపిస్తే మిర్యాలగూడను పల్నాడు రాజకీయంగా మారుస్తారని హెచ్చరించారు.అందరి వాడిగా, మీవాడిగా మీ కోసం పని చేస్తానని హామీ నిచ్చారు. తనను గెలిపించి అసెంబ్లీకి పంపించితే మిర్యాలగూడ నియోజవర్గ గౌరవాన్ని కాపాడుతానని రాష్ట్రంలోనే నియోజకవర్గాన్ని గుర్తించేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. మీకోసం పనిచేసే నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ నాయక్, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, రమ, జ్యోతి, ఎంవి రమణ, డబ్బికార్ మల్లేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి, రవి నాయక్, డా.మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగా రెడ్డి, పరుశురాములు, భవాండ్ల పాండు, తిరుపతి రామ్మూర్తి, ఎండి అంజాద్, వదూద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.