బీఎల్ఆర్ విస్తృత ప్రచారం

రథ సారథి,దామరచర్ల:

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరచర్ల మండలం కేశవ పురం గ్రామం నుంచి ప్రారంభమై రామోజీ తండా, దన్యాల బండ తండా, మాన్ తండాలలో విస్తృతంగా పర్యటించడం జరిగింది . ఈ సందర్భంగా బిఎల్ఆర్ మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజక వర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ , కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, మండల పార్టీ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సైదా నాయక్, ఎంపీటీసీ లు రజిత దేవేందర్, నాగు నాయక్, సర్పంచులు కాంగ్రెస్ నాయకులు మరియు బీ ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.