మిల్లర్ల సిండికేట్ పై విచారణ చేపట్టాలి
రథ సారథి,మిర్యాలగూడ:
మిర్యాలగూడలో రైస్ మిల్లులను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం సందర్శించడం జరిగింది. మిర్యాలగూడలో ఉన్నటువంటి రైస్ మిల్లులు సిండికేట్ గా ఏర్పడి రైతులను నిలువు దోపిడి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బంటు వెంకటేశ్వర్లు ఆరోపించారు. గత నాలుగు రోజుల క్రితం పొట్టు వడ్లకు రూ .2780 దాకా కొనుగోలు చేసి ఎర్ర పుట్టు వడ్లకు రూ .2650 రూపాయల పైగా కొనుగోలు చేసినారు. ఇవాళ తెల్ల పొట్టు రు. 2400 వందలు, ఎర్ర పొట్టుకు రూ .2200 వందలకు కొనుగోలు చేస్తామనీ చెప్తున్నారని అన్నారు. రైతులు ఆరు కాలం కష్టపడి పండించిన వడ్లను మిల్లుకు తీసుకొని వచ్చేసరికి మిల్లర్లు సిండికేట్ గా ఏర్పడి ఒక క్వింటాకు రూ .400 నుంచి రూ.500 రూపాయల వరకు తగ్గించినారనీ దీనివలన రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ధాన్యం అమ్ముకునే సమయంలో ఐటీ దాడులు జరగటం వలన మిల్లర్లు దానినీ సాకుగా చూపించి రైతుల దగ్గర ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంవత్సరం రైతులు బోర్ల కింద బావుల కింద నీటి ఎద్దడి ఏర్పడ్డ కూడ కష్టపడి మడిమడికి పైప్ లైన్ వేసుకొని ధాన్యం పండిస్తే తీరా ఇక్కడికి తీసుకొని వస్తే రైతులు చాలా మోసపోతావున్నా రని బంటు వెంకటేశ్వర్లు అన్నారు.ఒకవైపు ఎన్నికలు రావడంతో అధికారులు ప్రజాప్రతినిధులు అందులో నిమగ్నమై ఉండగా మిల్లర్లు మాత్రం రైతులని నిలువు దోపిడీ చేస్తా ఉన్నారని , రైతులు దూర ప్రాంతాలయిన పూసలపాడు ,ఎల్లాపురం, బొ త్తల పాలెం, గుడుగుంట్ల పాలెం నుండి వచ్చినారని ఆయన అన్నారు. వెంటనే అధికారులు మిల్లర్ లతో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను కలుపుకొని ఆందోళన చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కంచర్ల శ్రీరామ్ రెడ్డి, గార్లపాటి రామచంద్రారెడ్డి, బంటు వెంకయ్య ,జానపాటి మల్లయ్య, వెంకన్న ,రామలింగం, శ్రీరాములు, గోవిందు, రమేష్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.