భాస్కర్ రావు సతీమణి జయ ఇంటింటి ప్రచారం
రథసారథి ,మిర్యాలగూడ:
మిర్యాలగూడ పట్టణంలో ఆది వారం మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు సతీమణి నల్లమోతు జయ మరియు బీఆర్ఎస్ పార్టీ మహిళలు పలు వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా నల్లమోతు జయ మాట్లాడుతూ గత పదేళ్లుగా మిర్యాలగూడ నియోజవర్గం పలు రంగాల్లో అభివృద్ధి సాధించిందని మరింత పురోగతి సాధించేందుకు భాస్కర్ రావుని తిరిగి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. అలాగే దామరచర్ల మండలం వాడపల్లిలో కూడా నల్లమోతు జయ మరియు బీఆర్ఎస్ పార్టీ మహిళలు శ్రేణులు ఇంటింటి ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు.