జోరుగా..శానంపూడి సైదన్న ఎన్నికల ప్రచారం

 

 

జనసంద్రమైన గ్రామాలు, తండాలు..

 

రథసారథి,హుజూర్ నగర్:

హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా..మేళ్ళ చెర్వు మండలంలోని నల్లబండ గూడెం, కప్పలకుంట తండా, మరియు దుబ్బ తండా లలో.. గెలుపే లక్ష్యంగా హుజుర్ నగర్ నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మరియు స్థానిక శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వారితో పాటు మలిదశ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ,అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి బాణోత్ రమణా నాయక్ మరియు మండల ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు,మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు,మహిళలు కోలాటాలతో భారీ ర్యాలీ నిర్వహించినారు.గ్రామ మహిళలు బొట్టుపెట్టి,మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. పలువురు ఎమ్మెల్యే సైదిరెడ్డిని శాలువాలతో సన్మానించి, గజమాలలతో సత్కరించటం జరిగింది.తదనంతరం ప్రచారానికి తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఎమ్మెల్యే సైదిరెడ్డి మాట్లాడుతూ…ఈ నాలుగేళ్ళ లో జరిగిన అభివృద్ధి మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. అభివృద్ధి ని చూసి మరోసారి ఆశీర్వదించండి, మీ సేవకుడిగా పని చేస్తాను అన్నారు.హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు,మీ ఓటు ఎవరికి వేస్తే ఉపయోగం ఉంటదో..ఆలోచించి ఓటు వేయాలి అనీ హితవు పలికారు.రైతు బంధు వద్దని చెప్పిన వాళ్ళు, 3 గంటలు కరెంట్ చాలు అనేవాళ్ళు కావాలా.. 24 గంటల కరెంట్ ఇచ్చేవాళ్ళు కావాలా అని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఈవీఎం ప్యాడ్ లో 5 వ నెంబర్ కారు గుర్తుకు ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాల న్నారు.ఈనెల 30న జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకు వేసి మరోసారి ఆశీర్వదించగలని కోరారు.కారు గుర్తుకు ఓటేద్దాం హుజుర్ నగర్ లో అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దాం అని అన్నారు. చేసిన అభివృద్ధి,సంక్షేమ పథకాలు చెప్పి రాజకీయం చేసేది ఓకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. హుజుర్ నగర్ లో 2019 నుండి 2023 వరకు నియోజకవర్గం ను ఎంతో అభివృద్ధి చేసుకున్నాం అనీ,2019లో నేను ఎమ్మెల్యే గా గెలిచిన తర్వాత నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు,డ్రైనేజీలు నిర్మాణం పూర్తి చేసినాము అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి అన్నారు.పత్తా లేని ఉత్తమ్ కావాల్నా కండ్ల ముందు అభివృద్ధి చేసిన సైదన్న కావాల్నా ప్రజలు ఆలోచించాలి అనీ తెలిపారు.ఉత్తమ్ అభివృద్ధికి అడ్డుపడినా..సైదన్న చేస్తూనే ఉంటడు అని, గతంలో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోలేదు, సైదన్న వచ్చాక అభివృద్ధి మొదలైంది అని ప్రజలు అనుకుంటున్నారు అనీ ఎమ్మెల్యే తెలిపారు.హుజుర్నగర్ లో కారు గుర్తు కు ఓటేసి కాంగ్రెస్, బీజేపీ పార్టీలకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు,ముఖ్య నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.