నోముల భగత్ కు భారీగా ప్రజా స్పందన
రథసారధి ,పెద్దవూర:
నాగార్జునసాగర్ అసెంబ్లీఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దవూర మండలం, వెల్మగూడెం గ్రామంలో రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్ తో కలిసి బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ ఎన్నికల ప్రచారం చేపట్టారు.ప్రజలు పెద్ద ఎత్తున హాజరై హారతులతో, కోలాటాలతో ఆశీర్వాదం అందిస్తూ.. విజయ తిలకం దిద్దారు..ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ మాట్లాడుతూనాగార్జునసాగర్ నియోజకవర్గంలో గడచిన ఈ ఐదు సంవత్సరాలు ఐదు తరాలకు ఉపయోగపడే అభివృద్ధి చేసిన మీ నోముల భగత్ కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలందరినీ కోరారు.మా నాన్న నోముల నర్సింహయ్య గారు 2018లోగెలిచిన తర్వాత ఆయన దురదృష్టవశాత్తు మరణించడంతో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో నాకు టికెట్ ఇస్తే మళ్ళీ నేను ఉప ఎన్నికల్లో నా నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో గెలుపొందిన తరువాత నేను కష్టపడి నా ప్రజలకు నేను నాగార్జునసాగర్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు నన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గత మాజీ శాసనసభ్యులు జానా రెడ్డి, వారి తనయుడు జై వీర్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఏమీ అభివృద్ధి చేయలేదు ఇంతకుముందు మేమే అభివృద్ధి చేసినాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు మందికి పుట్టిన బిడ్డని తన బిడ్డ అని ముద్దాడుతున్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు అనీ ఎద్దేవా చేశారు.ఇక్కడ జరిగిన అభివృద్దికి కారణం ఎవరు.. ఎవరు నిధులు తెచ్చారు.. అని ప్రజలకు అన్ని తెలుసు.. కేసీఅర్ నిధులు ఇస్తే ప్రతి పని దగ్గర ఉండి పనులు చేయించినానుసీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అభివృద్ధితో నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రాంతవాసుల ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది అంటే నా ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్టే కదా అన్నారు.కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అవకాశవాద రాజకీయాలు చేస్తూ గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గలో పరిపాలించినప్పుడు ప్రజల వద్ద అప్పుడు దోచుకున్న డబ్బును ఇప్పుడు ఎన్నికలు రాగానే డబ్బు సంచులతో వచ్చి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు అని ఆరోపించారు. మీరు నమ్మొద్దు.. 36 సంవత్సరాలుగా నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఏనాడైనా మీ మధ్యలోకి వచ్చాడా ఆలోచించండి..మీ నోముల భగత్ అనే అతను అందరికీ ఒక కొడుకులా, తమ్మునిలా, అన్నలా, మీ కుటుంబ సభ్యులలో నేను ఒకడినై మీకు ఈ సమస్య వచ్చిన 24 గంటలు అందుబాటులో ఉండి అన్నింటా తోడుగా ఉంటాను అన్నారు.వచ్చే ఎన్నికల్లో మొదటి బ్యాలెట్ లో 3వ గుర్తు బీ ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నా అని నోముల భగత్ తెలిపారు..ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అబ్బీడి కృష్ణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ ,మార్కెట్ చైర్మన్ జవాజి వెంకటేశ్వర్లు,మండల పార్టీ అధ్యక్షుడు రవి నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గజ్జల లింగారెడ్డి, రాష్ట్ర నాయకులు గోన విష్ణువర్ధన్ రావు, మాజీ ఎంపీపీ కూరాకుల అంతయ్య, రాష్ట్ర నాయకులు కర్ణ బ్రహ్మారెడ్డి, ఆప్షన్ నెంబర్ బషీర్,మైనారిటీ నియోజకవర్గ నాయకులు షేక్ అబ్బాస్, మహిళా మండల అధ్యక్షురాలు మాధవి,మార్కెట్ డైరెక్టర్ పోదిల్ల శ్రీను,మండల యూత్ అధ్యక్షుడు మెండే సైదులు,నడ్డి సత్యం ,మండల ఉపాధ్యక్షుడు తుడుం రాకేష్, పగడాల వెంకటరెడ్డి, దేవస్థాన చైర్మన్ చెన్ను వెంకట్ రెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీకర్ నాయక్,ఈసం కొండల్, అద్దంకి గోవర్ధన్ ,వైస్ ఎంపీపీ గోన వివేక్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆడెపు రామలింగయ్య, సర్పంచ్ రావుల శ్రీను యాదవ్,ఉప సర్పంచ్ బాణాల శ్రీనివాస్ రావు , గ్రామశాఖ అధ్యక్షులు మెండే వెంకటయ్య, తెరాస ముఖ్య నాయకులు దాచిరెడ్డి నవీన్ కుమార్ రెడ్డి, కొట్టె రామలింగయ్య,మర్రి విజయ్, మహేష్, నరేష్,రమేష్, లక్సమయ్య,మద్దూరి ఇదయ్య నారాయణ, కట్టేబోయిన యల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.