నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

రథ సారథి, మిర్యాలగూడ:

పేద ప్రజలందరికీ ఇండ్లు, ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఏ.ఐ.ఎఫ్.బి. జిల్లా ప్రధాన కార్యదర్శి. పరంగి రాము రాష్ట్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. స్థానిక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్- ఏ.ఐ.ఎఫ్.బి. పార్టీ కార్యాలయంలో జరిగిన డివిజన్ కమిటీ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పేదల నోట్లో మట్టికొడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మేము ఇచ్చినమని చెప్పుకుంటున్న ఇండ్లు కానీ, తెలంగాణ ప్రభుత్వం చెప్పుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్లు కానీ నేటికీ సరిగా పంపిణీ చేయలేదు, కనీసం ఇళ్ల స్థలాలు కూడ ఇవ్వడం లేదు, ఇండ్ల స్థలాలు లేని వారికి స్థలం కేటాయించి ఇంటి నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇచ్చింది లేదని మండిపడ్డారు. ఇప్పటికే నిరుపేదలందరూ అనేక దఫాలుగా ప్రజాప్రతినిధులకు మరియు అధికారులకు విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. పేదలకు పంచడానికి భూమి ఉండదు కానీ భూకబ్జా దారులు ఆక్రమించుకొని అమ్ముకోవడానికి భూములుంటాయా? కబ్జాలు చేయడానికి ఎకరాలకు ఎకరాలు భూమి దొరుకుతుంది. కానీ పేదలకు ఇచ్చేందుకు ఒక గుంట భూమి కూడా దొరకదా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులు కబ్జాలు చేస్తా ఉంటే అధికారులు మాత్రం పట్టే పట్టనట్టుగా బాధ్యరహితంగా వ్యవరిస్తున్నారు అన్నారు. ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇవ్వాలి. మరియు స్థలం లేని వారికి ప్రభుత్వమే ఇంటి స్థలము కేటాయించి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఇచ్చి పేదలను ఆదుకోవాలని పరంగి రాము డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున పేదలందరిని కలుపుకొని ఏ.ఐ.ఎఫ్.బి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలు చేపడతామని డిమాండ్ చేశారు.  ఈసమావేశంలో మహిళ విభాగం. ఏ.ఐ.ఏ.యం.ఎస్. జిల్లా అధ్యక్షురాలు. చెన్నబోయిన నర్సమ్మ, టి.యు.సి.సి. జిల్లా నాయకులు. యండి. జలీల్, అజీజ్, ఏ.ఐ.వై.ఎల్. జిల్లా నాయకులు, నజీర్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.