కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పంపాలి: జూలకంటి

 

పదేళ్లలో పేదలకు అందని సంక్షేమం

 

రథసారథి,మిర్యాలగూడ

పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన కేసీఆర్ ను ఈ ఎన్నికలో ఓడించి ఫామ్ హౌస్ కు పంపాలని సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని బంగారిగడ్డ లో ప్రచారం నిర్వహించారు. మహిళలు ఎదురువెళ్లి పూలమాలలతో, హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల దొంగలు వస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు . పదేళ్లుగా స్థానిక ఎమ్మెల్యే నియోజక వర్గాన్ని పట్టించుకోకుండా సొంత పనులకు అధికారాన్ని ఉపయోగించుకున్నారన్నారు. ఏ రోజు ప్రజల కోసం పని చేయలేదని, కనీసం ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. సేవ ముసుగులో మరొకరు రాజకీయం చేస్తున్నారని పల్నాడు కమలహాసన్ గా నటిస్తున్నట్లు వున్న దన్నారు.. వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే ఆ వార్డును చూసిన పాపాన పోలేదని ఆరోపించారు. కౌన్సిలర్ గా ప్రజా సమస్యలను పట్టించుకోని ఆ నాయకుడిని ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఏం చేస్తాడని ధ్వజమెత్తారు. వాళ్ళను గెలిపిస్తే అసెంబ్లీలో చివరి బెంచీలో కూర్చుంటారని అదే తనను గెలిపిస్తే ప్రతిపక్ష నాయకుడిగా ముందు పెంచిన కూర్చొని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పై ఒత్తిడి తీసుకొస్తా అన్నారు. పదవుల కోసమే రాజకీయం చేస్తున్నారని దానికోసం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో మారెందుకు వెనకాడరని అలాంటి నాయకులను ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తీగల సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, కార్యదర్శులు భవాండ్ల పాండు, డా. మల్లు గౌతమ్ రెడ్డి, మల్లయ్య, బీబమ్మ, ఇడ్లి బండి శ్రీను, నక్క వెంకటేశ్వర్లు, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.