రైతన్న కు బీఆర్ఎస్ ప్రభుత్వం అండ: భాస్కర్ రావు

భాస్కర్ రావు కు మహిళల అపూర్వ స్వాగతం

రథ సారథి, మాడుగులపల్లి:

దేశానికి అన్నం పెట్టె రైతాంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, అందులో భాగంగానే రైతు సంక్షేమం కోసం పథకాలు రూపొందించి అమలు చేయడం జరిగిందని మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యె అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అన్నారు.మంగళవారం మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం, చింతలగూడెం, గండ్రవాని గూడెం, ఇస్కబావిగూడెం, తోపుచర్ల, గున్ రెడ్డిగూడెం, సీత్యాతండ, పుచ్చకాయల గూడెం, భీమనపల్లి, చర్లగూడెం, కల్వలపాలెం తదితర గ్రామాల్లో బిఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రగతి యాత్ర జరిగింది. ఆయా గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి, అపూర్వంగా స్వాగతించారు. మొదటగా పలు గ్రామాల్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం మహిళ కోలాట బృందం వాడ వాడనా కలియ తిరుగుతూ పలువురిని ఆకర్షించారు. పూలమాలులు, వేసి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి భాస్కర్ రావు మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను సంరక్షించి భూగర్భా జలాలను పెంచి పర్యావరణాన్ని కాపాడటం జరిగిందన్నారు. అదే విధంగా రైతు బంధు, రైతు భీమ, రుణమాఫీ ,ఉచితంగా 24 గంటలు కరెంటు తదితర సంక్షేమాలు అందించామన్నారు.

బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో సౌభాగ్యలక్ష్మీ పథకం,అన్నపూర్ణ పథకం, కెసిఆర్ భీమా, కేసీఆర్ ఆరోగ్య రక్ష పథకాలతో పాటు రైతుబంధు పెంపుదల, ఆసరా పెన్షన్లు పెంపుదల చేసి లబ్ధి చేరూర్చనున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు కారు గుర్తుకు ఓటేసి, తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి, ఎంపీపీ పోకల శ్రీవిద్యరాజు, బోఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు మోసిన్ అలి, పిఏసిఎస్ చైర్మన్ జెరిపోతుల రాములుగాడ్, బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.