బత్తుల లక్ష్మారెడ్డి కి తండాల్లో ఘన స్వాగతం
రథ సారథి, దామరచర్ల:
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామం నుంచి ప్రారంభమై కల్లేపల్లి, గాంధీ నగర్, తిమ్మాపురం, పడమట తండా, తూర్పు తండా, పుట్టలగడ్డ, శాంతి నగర్, నర్సాపురం మీదుగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయా గిరిజన తండాల్లో మహిళలు బీఎల్ఆర్ కి ఘన స్వాగతం పలికారు. బీ ఎల్ఆర్ ను స్థానిక ప్రజలు గజ పూల మాలలతో సత్కరించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, మండల పార్టీ ప్రసిడెంట్ గాజుల శ్రీను, వై ఎస్ ఆర్ టి పి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజం నర్సిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.