నల్లమోతు సిద్ధార్థ ఎన్నికల ప్రచారం
రథసారధి, దామరచర్ల:
బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ని గెలిపించాలని దామరచర్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎన్.బీ.ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ నల్లమోతు సిద్ధార్థ మంగళవారం ఇంటింటికి ఎన్నికల ప్రచారంచేసారు. దామరచర్ల మండలంలో చేసినటువంటి వివిధ అభివృద్ధి పనులు, పలు ప్రజా సంక్షేను పధకాల అమలు గురించి వివారించారు. బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని అంశాలు సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలోని రానున్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరీ ఆశీర్వాదం తో కారు గుర్తుకు ఓటేసి, ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ కుందూరు వీర కోటిరెడ్డి, మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ధారగాని వెంకటేశ్వర్లు గౌడ్, ఎంపీటీసీ సోము సైదిరెడ్డి బిఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.