బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి : భాస్కర్ రావు

 రథసారథి మిర్యాలగూడ:

బ్రాహ్మణుల సంక్షేమానికి తాము కృషి చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు తెలిపారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన సమావేశంలో భాస్కరరావు మాట్లాడారు. తనను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపిస్తే బ్రాహ్మణులకు ఒక కమ్యూనిటీ భవనాన్ని ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఆరులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వడం, సౌభాగ్య లక్ష్మి పింఛన్లు, వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వడం చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ బ్రాహ్మణుల కోసం ప్రత్యేక సొసైటీ ని ఏర్పాటు చేశారని, దానిద్వారా నిరుద్యోగులైన వారికి స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాలను మంజూరు చేశారు అన్నారు. అర్చకులకు ధూపదీప నైవేద్యానికి నిధులను కేటాయించి వారినీ ఆదుకున్నారని తెలిపారు. అలాగే బ్రాహ్మణ యువతీ యువకులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయం చేశార న్నారు. అనంతరం భాస్కర రావును బ్రాహ్మణులు, వేద పండితులు ఘనంగా సత్కరించి ఆయనను ఆశీర్వదించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, బోయినపల్లి వెంకటరమణారావు, పి కృష్ణమూర్తి, లక్ష్మీనారాయణ శర్మ ,మామిడాల వేణుగోపాలరావు, రాధాకృష్ణ శర్మ, గిరి ,టి రామచంద్రరావు, లోకా చార్యులు, సత్యనారాయణ శర్మ, మామిడాల సురేష్ బాబు, కొప్పోలు వెంకటేశ్వరరావు, భైరవభట్ల రాంబాబు శర్మ, చిట్యాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.