ప్రచారంలో దూసుకుపోతున్న నోముల భగత్ కుమార్

 

రథసారథి ,హాలియా:

నాగార్జున సాగర్  అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఎన్నికల ఇంచార్జ్లు ఎమ్మెల్సీ కోటి రెడ్డి, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ రాంచందర్ నాయక్ తో కలిసి సాగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుమలగిరి మండలం లో తునికినూతల గ్రామంలో ఎన్నికల ప్రచార నిమిత్తం పర్య టించారు.ఈ సందర్భంగాఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు మాట్లాడుతూ తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని గత ఎలక్షన్లో కంటే ఈసారి ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని కోరారు.గతంలో తిరుమలగిరి మండలాలలో తండాలు ఎలా ఉండేదో మనకి తెలుసు అదే విధంగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామపంచాయతీలుగా చేసిన తర్వాత మన నిధులు మనం వాడుకొని ఎంత అభివృద్ధి చెందామో చూడాలని అన్నారు..బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 24 గంటలు ఉచిత విద్యుత్ , రైతులకు పెట్టుబడి ఇచ్చిన ఘనత మన కెసిఆర్ ది అన్నారు.అన్ని వర్గాలకు న్యాయం చేసేలా రైతుబంధు దళిత బంధు, బీసీ బంధు, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ , కంటి వెలుగు, రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇలా చెప్పుకుంటూ పోతే గతంలో గాని, ఇతర రాష్ట్రాల్లో గాని అసలే లేనటువంటి పథకాలు చాలా ఇచ్చుకున్నాం అన్నారు.కష్టకాలంలో మీ వెంట ఉన్న మా నాన్న నోముల నర్సింహాయ్య, నేను మీకు అండా గా ఉన్నాము, మమ్మల్ని కాపాడతారా ? లేదంటే ఈరోజు వచ్చి ఓట్లు కొనాలనీ చూస్తున్న కాంగ్రెస్ వాళ్ళని కాపాడతారా మీరే ఆలోచించుకోవాలని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ కోరారు.కరోనా సమయంలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఒక్కసారి కూడా మన కష్టాలను పట్టించుకున్నది లేదు, కేవలం ఎన్నికల కోసమనే ఇప్పుడు వచ్చి తర్వాత వెళ్లిపోయే వలస పక్షులు వీళ్ళు అనీ ఆయన విమర్శించారు.కానీ మీ నోముల భగత్ ఎప్పుడూ మీ మధ్యలోనే ఉంటూ మీ ఆపదల్లోనూ ఆనందాల్లోనూ మీ తోడుండేవాడు అనీ ఆయన పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో మన గ్రామాలను తండాలని బాగా అభివృద్ధి చేసుకొని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేలా ఆశీర్వదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భగవాన్ నాయక్, జడ్పీటీసీ సూర్య బాష్య నాయక్, మార్కెట్ చైర్మన్లు జవాజీ వెంకటేశ్వర్లు ,మర్ల చంద్రారెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు పిడిగం నాగయ్య, మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమలేష్, బాబురావు నాయక్, ఏ ఐ బి ఎస్ కేటావత్ బిక్ష్య నాయక్, మాజీ ఎంపీపీలు అల్లి పెద్దిరాజు, అనుముల ఏడు కొండల్, పాక్స్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాస్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పెద్దిరాజు, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మెన్ ఆడెపు రామలి లింగయ్య, మార్కెట్ డైరెక్టర్ బూడిద హరికృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు రమేష్ నాయక్, నాయకులు రమణ రాజు, నాసర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు జంగాల లక్ష్మి, పగడాల సైదులు,ఆవుదొడ్డి కార్తీక్,శ్రీను నాయక్, కొట్య నాయక్,సర్పంచ్ చందు లాల్ ,ఎంపీటీసీ రామవత్ భగ్గు నాయక్ గ్రామశాఖ అధ్యక్షులు రామవత్ రుప్ల నాయక్ , బిచ్చు నాయక్, భాషా నాయక్, దేవు నాయక్, రత్య నాయక్, డెడియా నాయక్, మోహిలా నాయక్,గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.