సంక్షేమాభివృద్ధి పై విస్తృతంగా ప్రచారం జరగాలి.. నల్లమోతు సిద్ధార్థ

 

రథ సారథి, వేములపల్లి:

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులపై విస్తృతంగా ప్రచారం జరపాలని ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ తెలిపారు.వేములపల్లి మండలం రావులపెంట, ఆమనగల్లు, సల్కునూర్, మంగాపురం గ్రామాలలో బీ ఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా జనం లోకి తీసుకెళ్లాలని ,పథకాల లబ్ధిదారుల ను కలుపు కొని ఓట్లను అభ్యర్థించాలని బీ ఆర్ఎస్ కార్యకర్తలను ఆయన కోరారు. మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నల్లమోతు భాస్కరరావును భారీ మెజార్టీతో గెలిపించేలా కార్యకర్తలు కృషి చేయాలని నలమోతు సిద్ధార్థ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతం ఎన్నికల కరపత్రాలను పంపిణీ చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు నామి రెడ్డి కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సర్పంచులు దొంతి రెడ్డి వెంకటరెడ్డి, అంకెపాక రాజు, సాయిని సైదులు, చిర్ర మల్లయ్య యాదవ్, ఎంపీటీసీ గడ్డం రాములమ్మ వెంకన్న, మేక లలిత రవి ,నంద్యాల శ్రీరామ్ రెడ్డి, చీరాల కృపాకర్ రావు మేక జయరాజ్, వల్లం పట్ల ప్రసాద్, కొల పాపయ్య , చంద్రయ్య, కృష్ణ ,ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.