బత్తుల లక్ష్మారెడ్డి విస్తృత ప్రచారం

రథ సారథి,మిర్యాలగూడ:

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలంలోని రుద్రారం గ్రామంలో ప్రారంభమై, లక్ష్మీపురం, ఎర్ర కాలువ తండ, కొత్తపేట, ముల్కలకాల్వ, రాయినిపాలేం, జాలుబాయి తండ, బాలాజీ తండ, అలగడప క్యాంపు, అలగడప, సుబ్బారెడ్డి గూడెం, కల్వపెల్లి, కల్వపెల్లి తండాలలో పర్యటించడం జరిగింది . మధ్యాహ్నం స్వల్ప విరామం తర్వాత తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ సంద్భంగా వర్షంలో సైతం బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతో పాటు అతి త్వరలోనే బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఆడబిడ్డ వివాహానికి శ్రీ శ్రీనివాస కల్యాణ శుభమస్తు పెళ్లి కనుక తో పాటు ప్రతీ ఆడబిడ్డకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు మా ఇంటి నుంచి పంపిస్తామని అలాగే ప్రతీ మండల కేంద్రంలో ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెడిసిన్ అందజేస్తామని తెలిపారు. మేము సేవా భావంతో రాజకీయాల్లోకి వచ్చాము ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి మిర్యాలగూడ నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎంటే చూపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు బసవయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.