పోరాడే నాయకుడిగా నన్ను అసెంబ్లీ కి పంపండి.. జూలకంటి

విస్తృత ప్రచారంలో సిపిఎం అభ్యర్థి 

రథ సారథి,మిర్యాలగూడ:

పోరాడే నాయకుడుగా నన్ను అసెంబ్లీకి పంపాలనిసిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి అన్నారు ఆదివారం పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు, శాంతినగర్ ,అశోక్ నగర్, ఇస్లాపురం కూరగాయల మార్కెట్ ఆయా షాపింగ్ మాల్ లలో విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు అన్ని వర్గాల ప్రజలు ఎత్తున ఎదురొచ్చి హారతులు పూలదండలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నానని ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. పనిచేసే నాయకుని ఎన్నుకోవాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఎన్నికల్లో సునామీల తీర్పు రాబోతుందని చెప్పారు. తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి తాను అభివృద్ధి చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నాడని ఆరోపించారు. సేవ ముసుగులో కాంగ్రెస్ అభ్యర్థి ప్రజలను మోసం చేసినందుకు చూస్తున్నాడని వార్డును అభివృద్ధి చేయని నాయకుడు ఎమ్మెల్యేగా ఏం పని చేస్తాడని విమర్శించారు. డబ్బు బలంతో గెలవాలని చూస్తున్న నాయకులను ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ధన బలం ముందు ప్రజాబలం గెలుస్తుందని చెప్పారు .తన గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేసి అధిక మెజారితో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తానని ప్రభుత్వ మెడలు వంచి నియోజవర్గ అభివృద్ధి కోసం పాటుపడతాన న్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, కార్యదర్శులు డా.మల్లు గౌతమ్ రెడ్డి, భవాండ్ల పాండు, నజీర్, రాజారత్నం, సాబేర్ అలీ, వీరాచారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.