భాస్కర్ రావు విస్తృత ప్రచారం..

రథ సారథి, మిర్యాలగూడ:

ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ మండలం హట్యాతండ, చింతపల్లి తదితర ప్రాంతాల్లో బిఆర్ఎస్ ప్రగతి యాత్ర జరిగింది. ఆయా ప్రాంతాల్లోని పలు దేవాలయల్లో మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసారు. గ్రామాల్లోని అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛంధంగా కదలివచ్చి స్వాగ తించారు. మహిళా కోలాట బృందం, తెలంగాణా కళాకారులు ఆట పాటలతో అలరించారు. గిరిజన మహిళలు సంప్రదాయ నృత్యాలు చేసి ఉత్సాహ పరిచారు. పలువురు మహిళలు బొట్టుపెట్టి, మంగళ హారతులతో దీవించారు. అభిమానులు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి, శాలువాలతో అభినందించారు.సందర్భంగా నల్లమోతు భాస్కరరావు మాట్లాడుతూఈ నెల 30న జరుగు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ,చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.