బి ఎల్ ఆర్ కు మాతృవియోగం

 

రథసారథి, మిర్యాలగూడ:

మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మాతృమూర్తి బత్తుల వెంకటరావమ్మ(77) ఆదివారం రాత్రి మృతి చెందారు. ఎన్నికలు సమీ పిస్తున్న వేళ విస్తృత ప్రచారంలో ఉన్న లక్ష్మారెడ్డి తల్లి మరణ వార్త తెలుసుకొని హుటాహుటిన తన ఇంటికి తరలివచ్చారు. తన తల్లి మృతదేహం వద్ద బత్తుల లక్ష్మారెడ్డి విలపిస్తున్న తీరును చూసి అభిమానులు, కార్యకర్తలు శోకసముద్రంలో మునిగిపోయారు. బత్తుల లక్ష్మారెడ్డి తల్లి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.