చట్టసభల్లో ఎర్రజెండా అవసరం.. సీతారాం ఏచూరి

 

రథసారథి,మిర్యాలగూడ:

చట్టసభలో ఎర్రజెండా నాయకుల అవసరం ఏర్పడిందని ప్రజలందరూ ఎర్రజెండా నాయకులను గెలిపించి అసెంబ్లీకి పంపాలని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మిర్యాలగూడ పట్టణంలో సోమవారం సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి గెలుపు కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ అశేష జనవాహిని మధ్య సాగింది. పట్టణంలోని హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి వేలాదిమందితో రాజీవ్ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అక్కడ జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు లేని చట్టసభలు బోసిపోతున్నాయని ప్రజా సమస్యలపై ప్రస్తావించే నాయకులే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పైరవీలు మోజులో అధికార, ప్రతిపక్ష ప్రతినిధులు పడి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పేద వర్గాల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వాటి పరిష్కారం కోసం పాలకులు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పేదల కోసం పోరాడే నాయకులు అవసరం ఉందని ఎన్నికల్లో పోరాడే అభ్యర్థులను గెలిపించి చట్టసభలకు పంపాలని పిలుపునిచ్చారు. మిర్యాలగూడలో జూలకంటి రంగన్న గెలుపు అనివార్యమని ప్రజలందరూ ఆలోచించి రంగన్నకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మీ అందరి కోసం రంగన్న అసెంబ్లీ సాక్షిగా పోరాటాలు చేసి సమస్యల పరిష్కార కోసం పూర్తి చేస్తారని చెప్పారు. రంగన్న గెలుపుతోనే ప్రజాస్వామ్యం రాజ్యాంగం కాపాడబడుతుందని దీనికోసం మనందరం కంకణ బద్ధులై రంగన్న ను గెలిపించుకోవాలని కోరారు. సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి తన గెలుపు రాష్ట్ర రాజకీయాలకు కీలక మలుపుగా మారుతుందని చెప్పారు. తాను మద్దతు ఇచ్చిన పార్టీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. మీకోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నానని పదవులు ఉన్నా లేకపోయినా పేద ప్రజల కోసం పనిచేస్తున్నానని తనను గెలిపించి అసెంబ్లీకి పంపితే మిర్యాలగూడ ప్రజల గౌరవాన్ని పెంచుతానని చెప్పారు. గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంద న్నారు . తన గెలుపుతోనే నియోజవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని మిగిలిన వారు ఎవరు గెలిచినా అసెంబ్లీలో చివరి బెంచ్ లో కూర్చుంటారని కనీసం సమస్యలపై మాట్లాడే అవకాశం కూడా రాదని చెప్పారు. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ధనాన్ని నమ్ముకుని ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని తాను మాత్రం ప్రజలు నమ్ముకుని ఉన్నాన న్నారు. నియోజవర్గ ప్రజలు ఎంతో ఆలోచిస్తున్నారని తన గెలుపు దాదాపు ఖరారు అయిందని ఈ ఎన్నికల్లో ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పారు. చట్టసభల్లో కమ్యూనిస్టులేని లోటు స్పష్టంగా కనిపిస్తుంద. న్నారు. ఎర్రజెండా గెలుపు అవశ్యకత ఏర్పడిందని ప్రజలందరూ తనకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు తీగల సాగర్, శ్రీ రామ్ నాయక్, రమ రమణ, నారి ఐలయ్య, డబికారి మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, మల్లు గౌతమ్ రెడ్డి, పాండు ,జగదీష్ చంద్ర, పరశురాములు, మంగా రెడ్డి, శశిధర్ రెడ్డి, రామ్మూర్తి, అయూబ్,అంజాద్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.