భాస్కర్ రావును గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టండి: సిద్ధార్థ


రథ సారథి, మిర్యాలగూడ:
మిర్యాలగూడ ఎమ్మెల్యేగా తిరిగి భాస్కర్ రావుని గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని ఎన్బిఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ కోరారు. సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా రామచంద్ర గూడెం, భాగ్యనగర్ కాలనీలో స్థానిక కౌన్సిలర్ తిరుమలగిరి స్వర్ణలత వజ్రం, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా భాస్కరరావును గెలిపిస్తేనే మిర్యాలగూడ నియోజకవర్గం అన్ని విధాలుగా మరింత అభివృద్ధి పథంలోకి దూసుకు వెళ్తుందని నల్లమోతు సిద్ధార్థ స్థానిక ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణ ప్రగతిని , బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఎన్నికల మేనిఫెస్టో కరపత్రాలను పంచారు. ఈనెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి భాస్కరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

Leave A Reply

Your email address will not be published.